• facebook
  • whatsapp
  • telegram

AIIMS NORCET: ఎయిమ్స్‌- నర్సింగ్ ఆఫీసర్ ప్రిలిమ్స్‌ ఫలితాలు  

* మే 5న ప్రధాన పరీక్ష

* మొత్తం 1,524 ఖాళీల భర్తీ
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)-6 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదయ్యాయి. ఈ పరీక్ష ఏప్రిల్‌ 14న జరిగిన విషయం తెలిసిందే. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 5న ప్రధాన పరీక్ష జరుగనుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.9300- రూ.34800 జీతంతో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది. నార్‌సెట్‌-6 ద్వారా మొత్తం 1,524 ఖాళీల భర్తీ కానున్నాయి.


 

నర్సింగ్ ఆఫీసర్ (నార్‌సెట్‌-6) ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.