• facebook
  • whatsapp
  • telegram

TGEAPCET 2024 counselling Process: తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్ వివరాలు

* అభ్యర్థులకు ముఖ్య సూచనలు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి జులై 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైంది. మే 7 నుంచి 11వ తేదీ వరకు టీజీ ఈఏపీసెట్‌ జరగ్గా.. ఫలితాలను మే 18న విడుదల చేశారు. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా బీఈ/ బీటెక్‌/ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం మూడు విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. తొలిదశ జులై 4 నుంచి 23 వరకు, రెండోదశ జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు, తుదిదశ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది విద్యార్థులు అర్హత సాధించారు. గత ఏడాది లెక్కల ప్రకారం కన్వీనర్‌ కోటా సీట్లు 90 వేల వరకూ ఉన్నాయి. 

మొదలైన తొలిదశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ...

అర్హులైన అభ్యర్థులు జులై 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇందుకు 12వ తేదీ వరకు అవకాశం ఉంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. జులై 6వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఎక్కడో ఒక చోట వెరిఫికేషన్‌కు హాజరుకావచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారు జులై 8 నుంచి 15వ తేదీ వరకు వారికి తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలి. వెబ్ ఆప్షన్లు పూర్తయిన తర్వాత జులై 19వ తేదీలోపు తొలి విడత సీట్లు కేటాయింపు జరుగుతుంది. వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు జులై 19 నుంచి 23 వరకు అవకాశం ఉంటుంది.

అర్హతలు ఇలా..

* ప్రవేశ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు ఈఏపీసెట్‌ 2024తో పాటు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ సబ్జెక్టులు జనరల్‌ 45%, ఇతరులు 40% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

* అభ్యర్థి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.

వయసుకు సంబంధించి డిసెంబర్ 31, 2024 నాటికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 16 ఏళ్లు; ఫార్మాడీ కోర్సుకు 17 ఏళ్లు నిండి ఉండాలి. 

* ఉపకారవేతనం పొందేందుకు గరిష్ఠ అర్హత వయస్సు ఓసీ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఇతరులకు 29 ఏళ్లలోపు ఉండాలి. 

* అభ్యర్థులు https://tgeapcet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. 

కౌన్సెలింగ్‌కు కావాల్సిన ధ్రువపత్రాలు...

* పదో తరగతి మార్కల మెమో

ఇంటర్మీడియట్ మార్కుల మెమో

*ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్‌

* ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్(టీసీ) 

* స్టడీ సర్టిఫికెట్‌

* తాజాగా జారీ అయిన ఆదాయ ధ్రువపత్రం 

* తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందిన కుల ధ్రువీకరణపత్రం

*తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్‌టికెట్‌

* తెలంగాణ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డు

* విద్యార్థి ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు

* స్పెషల్‌ కేటగిరీ విద్యార్థులైతే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు

స్లాట్ బుకింగ్ ఇలా..

* అభ్యర్థులు స్లాట్ బుకింగ్ కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అక్కడ హోంపేజీ మెనూలో కనిపించే ‘స్లాట్‌ బుకింగ్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* క్లిక్ చేయగానే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ పేజీ ఓపెన్ అవుతుంది.

*అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

*అక్కడ హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ‘షో అవైలబుల్‌ స్లాట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* ఆ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం ఏరోజు, ఏ సమయానికి వచ్చేది నమోదుచేయాలి. 

* సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం దగ్గరలోని హెల్ప్‌లైన్ సెంటర్ ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది.

 

                                           తొలిదశ
‣ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ 04-07-2024 నుంచి 12-07-2024 వరకు.
‣ ధ్రువపత్రాల పరిశీలన 06-07-2024 నుంచి 13-07-2024 వరకు.
‣ ఆప్షన్ల ఎంపిక 08-07-2024 నుంచి 15-07-2024 వరకు.
‣ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ 15-07-2024
‣ సీట్ల కేటాయింపు 19-07-2024
‣ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 19-07-2024 నుంచి 23-07-2024 వరకు.


 

                                            రెండోదశ
 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ 26-07-2024.
 ధ్రువపత్రాల పరిశీలన 27-07-2024.
 ఆప్షన్ల ఎంపిక 27-07-2024 నుంచి 28-07-2024 వరకు.
‣ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ 28-07-2024.
 సీట్ల కేటాయింపు 31-07-2024.
 సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 31-07-2024 నుంచి 02-08-2024 వరకు.


 

                                             తుదిదశ
‣ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ 08-08-2024.
 ధ్రువపత్రాల పరిశీలన 09-08-2024.
‣ ఆప్షన్ల ఎంపిక 09-08-2024 నుంచి 10-08-2024 వరకు.
 ఆప్షన్ల ఫ్రీజింగ్‌ 10-08-2024
 సీట్ల కేటాయింపు 13-08-2024
 సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 13-08-2024 నుంచి 15-08-2024 వరకు.


 ♦ తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీలు  


  ♦ తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌  
 

 ♦  తెలంగాణ మాక్ కౌన్సెలింగ్స్ - 2024  

 ‣ ఇంజినీరింగ్
 ‣ అగ్రిక‌ల్చ‌ర్ & మెడిక‌ల్‌


 

  ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి  



ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.