• facebook
  • whatsapp
  • telegram

Union Budget: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 3 పథకాలు

* ఐదేళ్లలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ

* నెల వేతనం, రూ.3వేల పీఎఫ్‌ రీయంబర్స్‌
 


దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ 2024-25ను (Union Budget) మంగళవారం ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. మూడు ఉద్యోగ కల్పన ఆధారిత పథకాలను ప్రకటించారు. ఉద్యోగ భవిష్య నిధి(EPFO)లో నమోదు ఆధారంగా ఈ పథకాలు అమలుచేస్తామని లోక్‌సభలో ప్రకటించారు.

తొలి పథకం: తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెల వేతనం అందిస్తామని సీతారామన్‌ తెలిపారు. అన్ని రంగాలకు దీన్ని వర్తింపజేస్తామన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద మూడు వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. గరిష్ఠంగా రూ.15 వేలు వరకు అందజేయనున్నారు.

రెండో పథకం: తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండో పథకాన్ని తీసుకొచ్చారు. తొలిసారి ఉద్యోగులతో పాటు ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి కంట్రిబ్యూషన్‌ (EPFO) ద్వారా దీన్ని అందజేయనున్నారు. ఉద్యోగం కల్పించిన నాటినుంచి నాలుగేళ్ల వరకు ఈ ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. దాదాపు 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గరిష్ఠంగా రూ.లక్ష వేతనం ఉన్నవారికి దీన్ని వర్తింపజేయనున్నారు.

మూడో పథకం: అదనంగా ఉద్యోగాలు కల్పించిన యాజమాన్యాలకు రెండేళ్ల పాటు రూ.3,000 వరకు ఈపీఎఫ్‌ఓ కంట్రిబ్యూషన్‌ రీయంబర్స్‌ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా.

20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ

మరోవైపు వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణనిస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. 1000 ఐటీఐలను హబ్‌-స్పోక్‌ మోడల్‌ కింద ఉన్నతీకరిస్తామని తెలిపింది. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు రూ.10 లక్షల వరకు రుణసాయం అందజేయనున్నట్లు పేర్కొంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.