* జులై 7న పరీక్ష నిర్వహణ
ఈనాడు ప్రతిభ డెస్క్: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 అడ్మిట్ కార్డులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సీటెట్కు మార్చిలో సీబీఎస్ఈ నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓఎమ్మార్ విధానంలో జులై 7న పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
సీటెట్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.