• facebook
  • whatsapp
  • telegram

  EAPCET : ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌కు 2.4 లక్షల మంది హాజరు

* గత ఏడాది కంటే 45 వేల మంది అధికం

* 15 రోజుల్లో ఫలితాల వెల్లడికి అధికారుల కసరత్తు

 

 

ఈనాడు, హైదరాబాద్‌:  ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా...వారిలో 2,40,617 మంది హాజరయ్యారు. గత ఏడాది ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు రాసింది 1,95,275 మంది మాత్రమే. అంటే ఈసారి 45,342 మంది అధికంగా ఉండటం విశేషం. అగ్రికల్చర్‌తోపాటు ఇంజినీరింగ్‌ పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని ఎప్‌సెట్‌ వర్గాలు తెలిపాయి. 15 రోజుల్లోపు ర్యాంకులు వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది మే 14వ తేదీకి ఎప్‌సెట్‌ ముగియగా...అదే నెల 25వ తేదీన ఫలితాలు వెల్లడించారు. ఈసారి కూడా ఒక రోజు అటుఇటుగా విడుదల కావొచ్చని తెలుస్తోంది.


ఇంటర్‌ తప్పినవారూ పోటీ

ఇంటర్‌ ఫలితాలు గత నెల 24న విడుదలయ్యాయి. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 2.18 లక్షల మంది పరీక్షలు రాయగా వారిలో 1.61 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసిన తెలంగాణ ఇంటర్‌బోర్డు రెగ్యులర్‌ విద్యార్థులు 1,81,754 మందిలో 1,72,666 మంది హాజరయ్యారు. దాన్ని బట్టి ఇంటర్‌ ఎంపీసీ తప్పిన 11 వేల మందికిపైగా ఎప్‌సెట్‌ రాశారని స్పష్టమవుతోంది. వారిలో చాలా మంది ఈనెల (మే) 24 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసి...అందులో ఉత్తీర్ణులై బీటెక్‌లో చేరతారని ఎప్‌సెట్‌ వర్గాలు చెబుతున్నాయి.


త్వరగా స్థిరపడేందుకు అవకాశమని..

ఇంజినీరింగ్‌లో చేరితే త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని, ఉద్యోగావకాశాలు అధికమన్న అభిప్రాయంతో తల్లిదండ్రులు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ‘గణాంకాలను పరిశీలిస్తే అగ్రికల్చర్‌ విభాగానికి హాజరయ్యే ఓసీ విద్యార్థుల సంఖ్య ఇంజినీరింగ్‌ విభాగంతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటోంది. మిగిలిన సామాజికవర్గాల వారిలో పెద్దగా తేడా లేదు’ అని ఎప్‌సెట్‌ కో కన్వీనర్‌ ఆచార్య విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ఈసారి అగ్రికల్చర్‌ విభాగానికి ఓసీలు 12,240 మంది దరఖాస్తు చేసుకోగా ఎస్సీలు 24,203, ఎస్టీలు 13,002 మంది దరఖాస్తు చేశారని ఆయన చెప్పారు. అంటే అగ్రికల్చర్‌లో ఓసీలు సుమారు 12 శాతం ఉండగా.. ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసిన వారిలో 29.56 శాతం(75,250 మంది) ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

 ఎప్‌సెట్‌ 2024: ఇంజినీరింగ్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది


ముఖ్య అంశాలు:

ఈసారి 2,54,750 మంది ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు రాశారు.

 గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 45,342 మంది ఎక్కువ.

అగ్రికల్చర్‌ పరీక్షలు కూడా శనివారంతో ముగిశాయి.

 15 రోజుల్లోపు ర్యాంకులు వెల్లడించే అవకాశం.

 ఇంటర్‌ ఎంపీసీ తప్పిన 11 వేల మందికిపైగా ఎప్‌సెట్‌ రాశారు.

 ఇంజినీరింగ్‌లో చేరితే త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని, ఉద్యోగావకాశాలు అధికమన్న అభిప్రాయంతో చాలా మంది ఎప్‌సెట్‌ రాశారు.

అగ్రికల్చర్‌ విభాగానికి హాజరయ్యే ఓసీ విద్యార్థుల సంఖ్య ఇంజినీరింగ్‌ విభాగంతో పోలిస్తే చాలా తక్కువ.


వివరాలు:

 ఎప్‌సెట్‌ 2024 ఇంజినీరింగ్‌ పరీక్షలు భారీగా విజయవంతమయ్యాయి. ఈసారి 2,54,750 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇది గత ఏడాది 1,95,275 మందితో పోలిస్తే 45,342 మంది ఎక్కువ.
అగ్రికల్చర్‌ పరీక్షలు కూడా శనివారంతో ముగిశాయి. అధికారులు 15 రోజుల్లోపు ర్యాంకులు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు.
 గత ఏడాది ఎప్‌సెట్‌ మే 14వ తేదీకి ముగియగా...అదే నెల 25వ తేదీన ఫలితాలు వెల్లడించారు. ఈసారి కూడా ఒక రోజు అటుఇటుగా విడుదల కావొచ్చని తెలుస్తోంది.
 ఇంటర్‌ ఫలితాలు గత నెల 24న విడుదలయ్యాయి. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 2.18 లక్షల మంది పరీక్షలు రాయగా వారిలో 1.61 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
 ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసిన తెలంగాణ ఇంటర్‌బోర్డు రెగ్యులర్‌ విద్యార్థులు 1,81,754 మందిలో 1,72,666 మంది హాజరయ్యారు. దాన్ని బట్టి ఇంటర్‌ ఎంపీసీ తప్పిన 11 వేల మందికిపైగా ఎప్‌సెట్‌ రాశారని స్పష్టమవుతోంది.
 ఇంజినీరింగ్‌లో చేరితే త్వరగా జీవితంలో స్థిరపడవచ్చని, ఉద్యోగావకాశాలు అధికమన్న అభిప్రాయంతో చాలా మంది ఎప్‌సెట్‌ రాశారు.
అగ్రికల్చర్‌ విభాగానికి హాజరయ్యే ఓసీ విద్యార్థుల సంఖ్య ఇంజినీరింగ్‌ విభాగంతో పోలిస్తే చాలా తక్కువ. ఈసారి అగ్రికల్చర్‌ విభాగానికి ఓసీలు 1

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.