• facebook
  • whatsapp
  • telegram

పీహెచ్‌డీ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల‌ ఆహ్వానం

 

ఇంద్ర‌ప్ర‌స్త ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐఐఐటీ)-దిల్లీ మాన్‌సూన్ సెషన్ 2021-2022 ఏడాదికి సంబంధించి పీహెచ్‌డీలో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.  పీహెచ్‌డీ ఇన్ కంప్యూటేష‌న‌ల్ బ‌యాల‌జీ(సీబీ), కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌(సీఎస్ఈ), ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌(ఈసీఈ), హ్యూమ‌న్‌-సెంట‌ర్డ్ డిజైన్(హెచ్‌సీడీ), మ్యాథ‌మేటిక్స్‌(మ్యాథ్స్‌), సోష‌ల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌(ఎస్ఎస్‌హెచ్‌) విభాగాల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తోంది. ఈ ప్రోగ్రాముల్లో చేరే వారికి ఇన్‌స్టిట్యూట్ ఆర్థికంగా చేయూత అందిస్తోంది. ఇన్‌స్టిట్యూట్ ఫెలోషిప్ కింద మొద‌టి, రెండో ఏడాదికి రూ.31 వేలు, మూడు, నాలుగో ఏడాదికి రూ.35 వేలు, ఐదో ఏడాదికి రూ.30 వేలు అందిస్తుంది. ల్యాప్‌టాప్‌/డెస్క్‌టాప్ కొనుగోలుకు అద‌నంగా రూ.50 వేలు ఇవ్వ‌నుంది. ప్ర‌వేశాల‌కు  4 ఏప్రిల్ 2021 వ‌ర‌కు  గ‌డువు ఉంది. 

వెబ్‌సైట్‌: https://iiitd.ac.in/admission/phd/apr2021

Posted Date : 16-03-2021