• facebook
  • whatsapp
  • telegram

ప‌ర్స‌న‌ల్‌ ఇంట‌ర్వ్యూ తేదీలను ప్ర‌క‌టించిన టిస్‌

​​​​​

ప్రోగ్రామ్ ఆప్టిట్యూట్ టెస్ట్‌(ప్యాట్‌), మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్‌(మ్యాట్‌) ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూల తేదీల‌ను టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌(టిస్‌) ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూల‌ను జులై 5 నుంచి 17 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. మే 8 జ‌ర‌గాల్సిన ప్యాట్‌, మ్యాట్ ప‌రీక్ష‌లు దేశంలో నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా వాయిదా ప‌డ్డాయి. ఈమేర‌కు ఆయా ప‌రీక్ష‌లను జూన్ 20న నిర్వ‌హించ‌నున్నారు. మే 31 నుంచి హాలుటికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. జూన్ 15 వ‌ర‌కు అభ్య‌ర్థులు త‌మ ప‌రీక్ష కేంద్రాల‌ను మార్చుకునే వెసులుబాటు ఉంది. ప‌రీక్ష‌కు హాజ‌రైన వారిని ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. జులై 26న షార్ట్‌లిస్ట్ చేసి ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన అభ్య‌ర్థులకు ఆగ‌స్టు 8 వ‌ర‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. 

Posted Date : 18-05-2021