• facebook
  • whatsapp
  • telegram

త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్లు

‣ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి త్వరలో ఉద్యోగాల ప్రకటన (నోటిఫికేషన్‌)ను విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా నియమితులైన బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. మే 20న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని వివరించారు. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు.

కొత్తగా నియమితులైన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తోపాటు సభ్యులు మే 21న ఉదయం 10.45 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కరోనా దృష్ట్యా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుంది. 

Posted Date : 21-05-2021