• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈ 12వ తరగతికి స్వల్పకాల పరీక్షలు!  

* మెజార్టీ రాష్ట్రాల సూచన

 

దిల్లీ: కొవిడ్‌ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరిధిలోని 12వ తరగతిలో ప్రధాన సబ్జెక్టులకు స్వల్పకాల పరీక్షలు నిర్వహించాలని మెజార్టీ రాష్ట్రాలు కోరాయి. అయితే ఈ కసరత్తు నిర్వహించడానికి ముందే ఉపాధ్యాయులు, విద్యార్థులకు టీకాలు వేయాలని సూచించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనిపై నిర్ణయాన్ని జూన్‌ 1న ప్రకటిస్తాం అని చెప్పారు. స్వల్పకాల పరీక్షలు మూడు గంటలకు బదులు 90 నిమిషాల్లో ముగుస్తాయని చెప్పారు. ఇందులో ఆబ్జెక్టివ్, చాలా స్వల్ప నిడివి సమాధానాల ప్రశ్నలే ఉంటాయన్నారు. ఈ పరీక్షలను రెండుసార్లు నిర్వహించొచ్చని చెప్పారు. కొవిడ్‌ సంబంధ సమస్య వల్ల ఒక విడతలో పరీక్షలు రాయలేని విద్యార్థికి మరో అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ప్రత్యక్ష పరీక్షల ప్రతిపాదనను కొట్టేయాలంటూ 300 మందికిపైగా విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు లేఖ రాశారు. గత ఏడాది తరహాలో ప్రత్యామ్నాయ మదింపు విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.  
 

Posted Date : 26-05-2021