• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు 

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును రెండో సారి పొడిగించారు. గతంలో పెంచిన గడువు మే 26తో ముగియగా.. దాన్ని జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. మే 26 నాటికి ఎంసెట్‌కు 2,01,367 మంది దరఖాస్తు చేశారు. అందులో ఇంజినీరింగ్‌కు 1,35,151 మంది, అగ్రికల్చర్‌కు 66,216 మంది దరఖాస్తులు సమర్పించారు.

Posted Date : 26-05-2021