• facebook
  • whatsapp
  • telegram

ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు!

ఫ‌స్టియ‌ర్‌ మార్కులే కేటాయించే అవకాశం

తెలంగాణ‌ ప్రభుత్వం యోచన
 


 

ఈనాడు, హైదరాబాద్‌: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఇంటర్‌మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. పరీక్షల నిర్వహణకు వీలులేకుంటే వాటిని రద్దు చేసి తొలి ఏడాదిలో సాధించిన మార్కులనే రెండో ఏడాదిలోనూ ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నెలన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఒకవేళ తమకు మార్కులు సరిపోవనుకున్న వారికి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు పరీక్షలు రాసుకునే ఆప్షన్‌ ఇస్తామని ఇంటర్‌బోర్డు స్పష్టం చేయనుంది. ద్వితీయ ఇంటర్‌లో సైన్స్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉన్నందున వాటిని కూడా రద్దు చేస్తారు. విద్యార్థులు రాసే సైన్స్‌ రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్‌ మార్కులు కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ వార్షిక పరీక్షలకు 4,73,967 మంది ఫీజులు చెల్లించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు (రెండో ఏడాదిలోకి వచ్చేవారు)కు మాత్రం సమీప భవిష్యత్తులో పరీక్షలు జరుపుతారు.

Posted Date : 02-06-2021