• facebook
  • whatsapp
  • telegram

వీశాట్‌ 2021 ఫేజ్‌-1 ప్ర‌వేశ ప‌రీక్ష‌ ఫలితాలు విడుద‌ల‌

 


 

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీలో బీటెక్, బీఫార్మసీ ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నిర్వహించిన వీశాట్‌-2021 ఫేజ్-1 (విజ్ఞాన్‌ స్కోలాస్టిక్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌) ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆ వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఎం.వై.ఎస్‌.ప్రసాద్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌.రఘునాథన్, అడ్మిషన్స్‌ డీన్‌ డాక్టర్‌ కేవీ కృష్ణకిషోర్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఎ.గౌరిశంకరరావు జూన్ 23న‌ విడుదల చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా 20 శాతం మంది విద్యార్థులు వీశాట్‌ పరీక్షకు హాజరయ్యారన్నారు. ఈ సంవత్సరం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. వీశాట్‌-2021 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు, ఎంసెట్‌ ర్యాంకులు, ఇంటర్మీడియట్‌ మార్కులను సైతం పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. వీశాట్‌ ఫేజ్‌-2 ప్రవేశ పరీక్షలను జూన్‌ 23 నుంచి జులై 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. వీశాట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను vignan.ac.in లో చూడవచ్చన్నారు. సమగ్ర సమాచారం కోసం టోల్‌ఫ్రీ నం.18004252529లో సంప్రదించవచ్చని తెలిపారు.

Posted Date : 24-06-2021