• facebook
  • whatsapp
  • telegram

ఏపీ నిట్‌లో జులై నుంచి తరగతులు

ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థులకు నిర్వహణ

 


 

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ నిట్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులకు జులై నుంచి తరగతులు నిర్వహించనున్నారు. ఆయా తరగతుల విద్యార్థులందరూ జులై 28 నుంచి 30వ తేదీలోపు ప్రాంగణానికి తరలిరావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్‌ను ఇప్పటికే పూర్తి చేయగా, కొవిడ్‌ విపత్తు నేపథ్యంలో ప్రాజెక్టులు మిగిలి పోయాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉన్నందున విద్యార్థులు ప్రాంగణానికి తరలిరావాలని సూచిస్తున్నారు. వచ్చిన విద్యార్థులను వారం రోజులు ఐసొలేషన్‌లో ఉంచుతారు. అనంతరం వారిని ప్రయోగశాలల్లోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.  ప్రథమ సంవత్సర విద్యార్థులకు జులై 17 నుంచి రెండో సెమిస్టర్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత వారం రోజుల పాటు సెలవులు ప్రకటించి రెండో ఏడాది ప్రక్రియను ప్రారంభించనున్నారు.


కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతులు

బీటెక్‌ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో తరగతులు నిర్వహించనున్నాం. ప్రస్తుతం ఎంటెక్‌, పీˆహెచ్‌డీ విద్యార్థులను పరిశోధనల నిమిత్తం జూన్‌ 30లోపు క్యాంపస్‌కు రావాలని ఆదేశించాం. ఈ ఏడాది నుంచి కొత్తగా ఎంబీఏ కోర్సు అమలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇప్పటికే విడుదల చేశాం. 

- సీఎస్పీ రావు, ఏపీ నిట్ డైరెక్టర్‌


 

Posted Date : 26-06-2021