• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వాయిదా?

 

దిల్లీ: 12వ తరగతి రెగ్యులర్‌ విద్యార్థుల ఫలితాలను సిద్ధం చేసేందుకు పాఠశాలలకు ఇదివరకు ఇచ్చిన గడువును జులై 25 వరకూ పొడిగించినట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నియంత్రణాధికారి భరద్వాజ్‌ తెలిపారు. నిజానికి 22వ తేదీ నాటికే బడులు ఈ క్రతువును పూర్తిచేయాల్సి ఉంది. ఉపాధ్యాయులపై ఒత్తిడి తీవ్రంగా ఉందని, వారి విజ్ఞప్తి మేరకు గడువును పొడిగిస్తున్నట్టు సీబీఎస్‌ఈ పేర్కొంది. అయితే- పాఠశాలలకు గడువు పొడిగించిన కారణంగా ఫలితాల ప్రకటన వాయిదా పడుతుందా? లేదా? అన్నది సీబీఎస్‌ఈ స్పష్టం చేయలేదు.

Posted Date : 22-07-2021