• facebook
  • whatsapp
  • telegram

ఐటీ రంగంలో 55 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

‣ మంత్రి గౌతమ్‌రెడ్డి
 

 

ఈనాడు, అమరావతి: ఐటీ రంగంలో వచ్చే మూడేళ్లలో 55 వేల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల పురోగతి, ఉపాధి కల్పనకు ఉన్న అవకాశాలపై విజయవాడలోని కార్యాలయంలో ఐటీశాఖ ఉన్నతాధికారులతో జులై 22న‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఐటీ రంగాన్ని ప్రోత్సహించటానికి విశాఖలో ఐకానిక్‌ టవర్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. కడపలోని కొప్పర్తి ఈఎంసీ ద్వారా భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని మంత్రి పేర్కొన్నారు. 
 

నెలకు రెండు సార్లు ఉద్యోగ మేళాలు

ప్రతి జిల్లాలో నెలకి రెండు పర్యాయాలు ఉద్యోగ మేళాలు నిర్వహించాలని, ఈ విధానాన్ని కడప జిల్లా నుంచి ప్రారంభించాలని మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదేశించారు. విజయవాడలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆగ‌స్టు 15న డిజిటల్‌ ఉపాధి కల్పన కార్యాలయాలను ప్రారంభించాలని, నైపుణ్యాభివృద్ధితో ఉపాధి, శిక్షణను అనుసంధానం చేయాలని సూచించారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలో నైపుణ్య కళాశాల భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Posted Date : 23-07-2021