• facebook
  • whatsapp
  • telegram

PG: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌ఐఎన్‌ నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎమ్మెస్సీ అప్లైడ్‌ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ కోర్సుల్లో చేరేందుకు జాతీయస్థాయిలో ఎన్‌ఐఎన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(ఎన్‌సీఈటీ) నిర్వహిస్తోంది. 2021-23 విద్యా సంవత్సరానికి రెండేళ్ల కోర్సుకు ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ కోర్సులో మొత్తం 39 సీట్లు ఉంటాయని ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు రాయాలనుకునే వారు ఆగ‌స్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థులకు మూడింటిలో ఒక సీటు చొప్పున స్థానిక కోటా ఉన్నట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షను హైదరాబాద్, దిల్లీ, కోల్‌కతా నగరాలకే పరిమితం చేసింది.

Posted Date : 17-08-2021