• facebook
  • whatsapp
  • telegram

ITI: ఆగ‌స్టు 18న ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌ మేళా 

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఐటీఐ కరీంనగర్‌లో ఆగ‌స్టు 18న అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్‌ ట్రేడులో ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. రాత, మౌఖిక పరీక్షతో ఎంపిక జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు ఆగ‌స్టు 18న బయోడేటా, ఆధార్, 2 ఫొటోలు, బ్యాంకు పుస్తకం, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు 2 జతల జిరాక్సు కాపీలను వెంట తీసుకురావాలని సూచించారు.

Posted Date : 17-08-2021