• facebook
  • whatsapp
  • telegram

BCOM STUDENTS: బీకాం విద్యార్థుల బెంబేలు

న్యూస్‌టుడే-అవనిగడ్డ: కృష్ణా విశ్వవిద్యాలయం శనివారం నిర్వహించిన బీకాం నాలుగో సెమిస్టర్‌ ఎకౌంటింగ్‌ ఫర్‌ సర్వీసు ఆర్గనైజేషన్‌ పేపర్‌లో తప్పులు దొర్లడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. రెండో యూనిట్‌లోని 11వ ప్రశ్నలో ఆంగ్ల మాధ్యమంలో ఇచ్చిన నాలుగు అంశాలు తెలుగు మీడియంలో ఇవ్వలేదని విద్యార్థులు చెప్పారు. ఇదే ప్రశ్నలో ఇంగ్లీషు మీడియంలో రిజర్వుఫండ్‌ రూ.5 వేలుగా ఇచ్చి, తెలుగు మీడియంలో రూ.లక్షగా ఇచ్చారు. గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరంగా ఆంగ్లమాధ్యమంలో 2010, 2009 అని ఇచ్చి, తెలుగు మీడియంలో 2009 రెండు సార్లు ఇచ్చారు.
* యూనిట్‌ 3లో 14వ ప్రశ్నలో టెలిగ్రాఫిక్‌ ట్రాన్స్‌ఫర్‌ను తెలుగులో చెల్లించిన ఆదాయపు పన్ను అని ఇచ్చారు. ్ర యూనిట్‌ 5లో 17వ ప్రశ్నలో చెల్లించవలసిన క్లైమ్స్‌ అని ఇచ్చి, తెలుగులో చెల్లించిన క్లైమ్‌లు అని ఇచ్చారు.  అదే ప్రశ్నలో లాభ,నష్టాల వినియోగిత ఖాతా అని ఇచ్చి, తెలుగులో లాభ, నష్టాల ఖాతా అని ఇచ్చారని విద్యార్థులు వాపోతున్నారు. ్ర ఈనెల 19న బీకాం ఆరో సెమిష్టర్‌లో 4వ యూనిట్‌లో 16వ ప్రశ్న సిలబస్‌లో లేనిది ఇ చ్చారు. అసలే కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రశ్నాపత్రాలలో తప్పులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.  


 

Posted Date : 22-08-2021