• facebook
  • whatsapp
  • telegram

JOB Mela: ఆగస్టు 26న‌ కేడీసీలో జాబ్‌ మేళా

విద్యానగర్, న్యూస్‌టుడే: హనుమకొండ కాకతీయ ప్రభుత్వ కళాశాల కెరియర్ గైడెన్స్, ప్లేస్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 26 ఉదయం 11 గంటలకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆన్‌లైన్‌ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.గణపతిరావు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్‌మెన్‌ అధికారి, బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ అధికారి పోస్టుల భర్తీకి ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులై 26 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కెరియర్ గైడెన్స్, ప్లేస్‌మెంట్‌ సెల్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వాసం శ్రీనివాస్‌ను నేరుగా గాని 98850 59533 నంబరులో సంప్రదించవచ్చన్నారు.

Posted Date : 25-08-2021