• facebook
  • whatsapp
  • telegram

Admissions: అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు 

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: సాగర్‌నగర్‌ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో చేరేందుకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఎం.మహేశ్వరరెడ్డి ఆగస్టు 26న ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 41 ఖాళీల భర్తీకి సంబంధించి ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. 6 నుంచి 14 ఏళ్లలోపు వయస్సు ఉండి కనీసం 40 శాతం అంధత్వం గల బాలికలు అర్హులన్నారు. ఉచిత విద్య, వసతి, భోజన సదుపాయాలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి తదితర అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు.

Posted Date : 27-08-2021