• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌ ప్రాథమిక కీ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఎట్టకేలకు జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్షల ప్రాథమిక కీని జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) సెప్టెంబరు 6న విడుదల చేసింది. పేపర్‌ లీకు కుంభకోణం నేపథ్యంలో గతానికి భిన్నంగా ఈసారి పరీక్షలు ముగిసిన తర్వాత నాలుగో రోజు కీని  విడుదల చేసింది. వాటిపై అభ్యంతరాలను తెలిపేందుకు సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు, .అంటే కేవలం ఒకటిన్నర రోజే గడువు ఇవ్వడం గమనార్హం. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన మొత్తం 2.50 లక్షల మంది సెప్టెంబరు 11వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఇప్పటికే ప్రకటించింది. అంటే జేఈఈ మెయిన్‌ ఫలితాలు 10వ తేదీలోపు వెల్లడి కావాల్సి ఉంది.

డీఈఈసెట్‌కు 7,591 దరఖాస్తులు

రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి సెప్టెంబరు 8వ తేదీన నిర్వహించనున్న ఆన్‌లైన్‌ పరీక్షకు మొత్తం 7,591 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్‌ శ్రీనివాసచారి తెలిపారు. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల వారీగా పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

 

https://testservices.nic.in/examsys21/root/downloadAdmitcard.aspx?enc=1Agc7dh0pU+tyeFB1Yuv8FXKaPbTL9VpE7sKvVB4HZBwN23LEemlXt94hf8GLxVO

Posted Date : 07-09-2021