• facebook
  • whatsapp
  • telegram

ఉపకారవేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల నుంచి 2020-21 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కొత్తగా చేరిన, పునరుద్ధరణ (రెన్యువల్‌) విద్యార్థులు సెప్టెంబరు 21వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ వెల్లడించింది. 

Posted Date : 14-09-2021