• facebook
  • whatsapp
  • telegram

Medical Seats: వైద్య సీట్లు పెరుగుతాయా?

 

ఈనాడు, అమరావతి : రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లు పెరుగుతాయా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పీజీ సీట్లు 2,210 వరకు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నవి 984. మిగిలినవి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఉన్నాయి. యూజీలో 5,010 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నవి 2,185. మిగిలిన సీట్లు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఉన్నాయి. ఆయా కళాశాలల నుంచి వెళ్లిన విజ్ఞప్తుల మేరకు జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) ద్వారా తనిఖీలు జరిగాయి. అయితే...అదనంగా ఎన్ని పీజీ/యూజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది? ఒకవేళ తగ్గాయా? అన్న దానిపై ఇప్పటివరకు వివరాలు తమకు అందలేదని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్యాంప్రసాద్‌  సెప్టెంబ‌ర్ 16న‌ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలలకు పీజీలో అదనంగా కొన్ని సీట్లు రావొచ్చని అంచనా. ప్రైవేట్‌ వైద్య కళాశాలల నుంచి నేరుగా ఎన్‌ఎంసీకి సీట్ల పెంపునకు అభ్యర్థనలు వెళ్లాయి. 

 

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

కళాఖండాల కోసం ఖండాంతర వేట

ఆదాయం చాలదు... రుణం తీరదు!

Posted Date : 16-09-2021