• facebook
  • whatsapp
  • telegram

JEE, NEET: జేఈఈ, నీట్‌ అభ్యర్థులకు అమెజాన్, శ్రీచైతన్య సంయుక్త శిక్షణ

దిల్లీ: అమెజాన్‌ అకాడమి, శ్రీచైతన్య భాగస్వామ్యంతో జేఈఈ, నీట్‌ అభ్యర్థులకు ఈ ఏడాది పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు ఈ సంస్థల ప్రతినిధులు సెప్టెంబరు 17న వెల్లడించారు. తమ విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (విద్య) అమోల్‌ గుర్వారా తెలిపారు. రెండు సంస్థల భాగస్వామ్యంలో భాగంగా అమెజాన్‌ అకాడమి ద్వారా శ్రీచైతన్య అధ్యాపకులు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. ‘గతేడాది జేఈఈ మెయిన్‌లో మా విద్యార్థులు 20,904 మంది ఎంపికయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 3,449, నీట్‌లో 36,547 మంది ర్యాంకులు సాధించారు. ఇపుడు అమెజాన్‌ అకాడమి కూడా జత కలవడంతో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలం’ అని శ్రీచైతన్య గ్రూప్‌ డైరెక్టర్‌ సుష్మా బొప్పన తెలిపారు.

Posted Date : 18-09-2021