• facebook
  • whatsapp
  • telegram

SV University: డిగ్రీ ప్రశ్నా పత్రం లీక్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

 

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రశ్నా పత్రం లీకేజీ కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లెలో బీకాం ఆరో సెమిస్టర్‌ అకౌంట్స్‌ మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష ప్రశ్నా పత్రం లీకైంది. సెప్టెంబరు 29 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేనేజింగ్‌ అకౌంటింగ్‌ పరీక్ష జరగాల్సి ఉంది. ఇవాళ ఉదయం 11.42 గంటలకే లీకైన ప్రశ్నా పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సెప్టెంబరు 23 నుంచి ఎస్‌వీయూ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వర్సిటీ పరిధిలోని 112 కళాశాలల్లో పరీక్షలు జరుగుతుండగా.. 73 వేల మంది డిగ్రీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 25 వేల మంది చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు.

Posted Date : 29-09-2021