• facebook
  • whatsapp
  • telegram

JEE: ఆరు విడతల్లో జేఈఈ కౌన్సెలింగ్‌  

* 16 నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీ ప్రారంభం

* 27న తొలి విడత కేటాయింపు

 * అమ్మాయిలకు 20% తప్పనిసరి

 

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలతోపాటు మరో 33 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. అక్టోబ‌రు 15వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులు వెల్లడి కానున్నాయి. ఆ మరుసటి రోజు నుంచే జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు అక్టోబ‌రు 12న కాల పట్టికను ప్రకటించింది. అక్టోబ‌రు 16వ తేదీన ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ నవంబరు 18న ఆరో విడత సీట్ల కేటాయింపుతో పూర్తవుతుంది. సీట్ల కేటాయింపులో సమస్యల పరిష్కారం, మార్పులకు నవంబరు 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఐఐటీలు మినహా మిగిలిన వాటిల్లో సీట్లు మిగిలిపోతే ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

 

రెండు విడతల్లో మాక్‌ కౌన్సెలింగ్‌

విద్యార్థులు తాము పొందిన ర్యాంకుకు.. ఎక్కడ, ఏ బ్రాంచిలో సీటు వస్తుందో అంచనాకు వచ్చేందుకు వీలుగా రెండు విడతల మాదిరి(మాక్‌) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఐచ్ఛికాలు ఇచ్చిన వారికి అక్టోబ‌రు22, 24వ తేదీన మాక్‌ కౌన్సెలింగ్‌ తాలూకూ సీట్లను ప్రదర్శిస్తారు కూడా. ఆ తర్వాత అధికారికంగా ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వారికి తొలి రౌండ్‌ సీట్లను 27వ తేదీన కేటాయిస్తారు. అమ్మాయిలకు గత ఏడాది మాదిరిగానే ప్రతి సంస్థలో కనీసం 20 శాతం సీట్లు కేటాయించాలి. అందుకు అనుగుణంగా అవసరమైతే సూమర్‌ న్యూమరరీ సీట్లు స్పష్టించాలి. మొత్తం సీట్లలో 10 శాతాన్ని విదేశీయులకు ఇవ్వొచ్చు. ఒకే ర్యాంకు వచ్చిన వారి మధ్య పోటీ ఉంది, సీట్లు తక్కువగా ఉండే పక్షంలో సూపర్‌ న్యూమరరీ కింద సీట్లు పెంచుతారు.

 

కాలపట్టిక ఇలా..

16 - 25వ తేదీ వరకు: రిజిస్ట్రేషన్‌ ప్రారంభం,  27న: తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు,  నవంబరు 1: రెండో విడత సీట్లు,  నవంబరు 6: 3వ విడత సీట్లు, 10వ తేదీ: 4వ విడత కేటాయింపు, 14వ తేదీ: 5వ విడత, 18వ తేదీ: చివరి విడత సీట్ల కేటాయింపు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఐఐటీ బాటలో తుది పరీక్ష!

ఎంసెట్‌, జేఈఈ మెలకువలు

జేఈఈ మెయిన్‌-2021 ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఎలా ఉంది?

ఎంసెట్‌, జేఈఈ మెలకువలు

రసాయన శాస్త్రం

*  భౌతికశాస్త్రం

 

Posted Date : 13-10-2021