• facebook
  • whatsapp
  • telegram

Degree College Seats: డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై స్టే పొడిగింపు

 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు(అలాట్‌మెంట్‌) ప్రక్రియను నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో వారం పొడిగించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం అక్టోబరు 21 ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 70% కన్వీనర్‌ కోటా, 30% యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉద్దేశించి అక్టోబరు 7న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 55ను సవాలు చేస్తూ రాయలసీమ డిగ్రీ కాలేజ్‌ అసోసియేషన్‌ హైకోర్టులో వ్యాజ్యం వేసింది. దానిపై ఈనెల 12న విచారణ జరిపిన ధర్మాసనం... విద్యార్థులు వెబ్‌ ఐచ్ఛికాల ద్వారా కళాశాలలను ఎంపిక చేసుకునే ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, సీట్ల కేటాయింపుపై మాత్రం ఈనెల 23 వరకు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఈ వ్యాజ్యం విచారణకురాగా.. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్‌ వేశామన్నారు. త్వరగా విచారణ జరపాలన్నారు. 

Posted Date : 21-10-2021