• facebook
  • whatsapp
  • telegram

BRAOU: ‘ఎంబీఏ’ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు గడువు జులై 26 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ప్రవేశ పరీక్ష-2022 దరఖాస్తులకు జులై 26 చివరి తేదీగా నిర్ణయించినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు జూన్‌ 28న తెలిపారు. వర్సిటీతో పాటు అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఐహెచ్‌సీఎం), కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (కిమ్స్‌), దారుస్సలాం ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ (డీఈటీ) ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్‌ www.braouonline.in ద్వారా దరఖాస్తు నింపి, పరీక్ష రుసుం ఆన్‌లైన్‌లో లేదా తెలంగాణ ఆన్‌లైన్‌ ఫ్రాంఛైజీల ద్వారా చెల్లించి రసీదు పొందాలన్నారు. పూర్తి వివరాలకు 040-23680441/241/246 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని వర్సిటీ అధికారులు కోరారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.