• facebook
  • whatsapp
  • telegram

Online Classes: అటు సెలవులు.. ఇటు ఆన్‌లైన్‌ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిన కాసేపటికే ఎల్బీనగర్‌ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆదివారం సాయంత్రం ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయని సందేశాలు పంపించింది. సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభించింది. ఈ ఒక్క పాఠశాలే కాదు.. నగరంలో చాలా విద్యా సంస్థలది ఇదే పద్ధతి. వర్షాలతో ప్రత్యక్ష తరగతులు నిలిచిపోవడంతో ఆన్‌లైన్‌ బాట పట్టాయి. గతంలో ఈ తరహా సెలవులు వస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకే పరిమితమయ్యేవారు. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఆన్‌లైన్‌ వనరులు అందుబాటులోకి రావడంతో బోధన పద్ధతుల్లోనూ మార్పులొచ్చాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఇకపై సెలవుల్లోనూ బోధన
కరోనా కారణంగా రెండేళ్లపాటు దాదాపుగా ఆన్‌లైన్‌లో తరగతులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అటు పాఠశాలలు, ఉపాధ్యాయులు.. ఇటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ సదుపాయాలు సమకూర్చుకున్నారు. ప్రస్తుతం ఏదైనా కారణాలతో నాలుగైదు రోజులు సెలవులు వస్తే ఆన్‌లైన్‌ వనరులను వినియోగించుకుని బోధన చేసేలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. సెలవుల్లోనూ బోధన కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. జూమ్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్జ్‌ వంటి ప్లాట్‌ఫారాలను వినియోగించుకుని బోధన సాగిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని ప్రైవేటు పాఠశాలలు బుధవారం వరకు ఆన్‌లైన్‌లో తరగతులు ఉంటాయని తల్లిదండ్రులు, విద్యార్థుల చరవాణులకు సందేశాలు పంపించాయి. గురువారం నుంచి ప్రత్యక్ష తరగతులు ఉంటాయని చెబుతున్నాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.