బేగంపేట, న్యూస్‌టుడే: బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) ఎ+ గుర్తింపునిచ్చినట్లు ప్రిన్సిపల్ డా.కె.పద్మావతి తెలిపారు. ఆగస్టు 22, 23వ తేదీల్లో న్యాక్ ఛైర్పర్సన్ ప్రొ.అరవింద్‌కుమార్ దీక్షిత్, సమన్వయకర్త డా.కిన్నరీ టక్కర్, సభ్యులు వీణ జక్కెన్నహళ్లి సిద్ధప్పల నేతృత్వంలోని బృందం కళాశాలను సందర్శించింది. ఐదేళ్ల కిందట న్యాక్ గుర్తింపులో బి+ గ్రేడు సాధించిన ఈ కళాశాల ప్రస్తుతం ఫోర్త్ సైకిల్ (4వసారి)లో ఏకంగా ఎ+ గ్రేడు సాధించడం విశేషం. దీంతో ఆగస్టు 30న కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. కేక్ కట్ చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.