• facebook
  • whatsapp
  • telegram

NEP: పోస్టుల రద్దు.. ఆందోళనలో ఉపాధ్యాయులు

ఇద్దరు ఎంఈవోల నియామకం  నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: జాతీయ విద్యా విధానంలో ఎంతో ప్రాధాన్యమున్న ఆర్ట్‌, క్రాఫ్ట్‌, వర్క్‌ టీచర్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న పోస్టుల్లో వందకు పైగా రద్దు కానున్నాయి. మండలానికి ఇద్దరు ఎంఈవోల నియామకం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జిల్లాలో 617 ఆర్ట్‌, వర్క్‌, పీఈటీ పోస్టులుంటే ఆర్ట్‌లో 324, పీఈటీ 84, వర్క్‌లో 209 ఉన్నాయి. క్రాఫ్ట్‌ విభాగం లేదు. వీటిల్లో 182 పోస్టుల్లో ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఆర్ట్‌లో 86, పీఈటీ 16, వర్క్‌లో 80 మంది పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరందరూ ఒప్పంద పద్ధతిలో సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్నారు. జీతాలు సక్రమంగా విడుదల కాకపోయినా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు.
కొత్త ఎంఈవోల కోసం..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 66 మండలాలు ఉన్నాయి. అందులో అన్ని మండలాల్లో విద్యాశాఖాధికారులు పనిచేస్తుండగా 17 చోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎంఈవో పోస్టుల్లో ఎంఈవో-1కి 17 మంది, ఎంఈవో-2 పోస్టుకు 66 మందిని నియమించనున్నారు. ఈ పోస్టుల్లో నియమించే వారికి జీతభత్యాల కోసం ఆర్ట్‌, పీఈటీ, క్రాఫ్ట్‌ పోస్టులు రద్దు చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి వంద వరకు రద్దయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో సంబంధిత టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరిచిపోతున్నారా... మంచిదే!

‣ ఐఐటీ సహా ప్రసిద్ధ సంస్థల్లో డిగ్రీ

‣ డీఆర్డీవోలో ఉద్యోగాలు

‣ ఏ ఉద్యోగ పరీక్షకు సిద్ధం కావాలి?

‣ ఏపీఈఏపీ సెట్‌ ప్రవేశాల్లో మార్పులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.