ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త కోర్సులను ప్రారంభించనున్నారు. పరిశ్రమల అనుసంధానంతో కోర్సులను డిజైన్ చేశారు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. శ్రీసిటీలోని పరిశ్రమల భాగస్వామ్యంతో సిలబస్‌ను రూపొందిస్తున్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయగానే ఆయా కంపెనీలే ఉద్యోగాల్లోకి తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. పరిశ్రమలతో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇప్పటికే కమిషనర్ పరిశ్రమలను సందర్శించి, ఉద్యోగ అవకాశాలను పరిశీలించారు. శ్రీసిటీలోని డైకిన్ కంపెనీకి రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్‌లో ఏటా 300 నుంచి 500మంది వరకు అవసరమవుతున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఈ కోర్సు పూర్తిచేసినవారిని నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటారు. మరో కంపెనీ అపాచీ టాడాకు వచ్చే ఏడాది 2వేల మంది వరకు ఫుట్‌వేర్ టెక్నాలజీ కోర్సు చదివినవారు అవసరం కానున్నారు. ఈ కంపెనీ పులివెందుల, వెంకటగిరిలోనూ ప్లాంట్లను ప్రారంభిస్తే ఉద్యోగ అవసరాలు మరింత పెరుగుతాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.