• facebook
  • whatsapp
  • telegram

AP Police Jobs: 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

411 ఎస్సై స్థాయి, 6,100 కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగాలు
విడుదల చేసిన ఏపీ పోలీసు నియామక మండలి

రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి న‌వంబ‌రు 28న‌ ప్రకటన జారీచేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై స్థాయి, 6,100 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీచేశారు. సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్హతలు
 సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్‌ ఉత్తీర్ణులై డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది.
 సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై.. ఇంటర్‌ రెండేళ్లు చదివి ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి
 సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్లమధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1995 జులై 2 తర్వాత, 2001 జులై 1 కంటే ముందు జన్మించిన వారై ఉండాలి.
 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. 1998 జులై 2 తర్వాత, 2004 జులై 1 కంటే ముందు పుట్టినవారై ఉండాలి. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
హోంగార్డులకు రిజర్వేషన్లు
‣ హోంగార్డులకు సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో రిజర్వేషన్‌ను 8 నుంచి 15 శాతానికి, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు 10 నుంచి 25 శాతానికి పెంచారు.
 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు రెండింటిలోనూ మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ
 ఆన్‌లైన్‌లో slprb.ap.gov.in లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు.
 సందేహాలు ఉంటే: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి ఫోన్‌ నంబరు 9441450639కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్‌ చేయొచ్చు.
మూడు దశల్లో ఎంపిక
సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు
 ప్రాథమిక రాత పరీక్ష: 2 పేపర్లు...200 మార్కులకు. బహుళైౖచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
పేపర్‌-1: పదోతరగతి స్థాయిలో అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ
పేపర్‌-2: జనరల్‌ స్టడీస్‌ (డిగ్రీ స్థాయిలో)
దేహదారుఢ్య పరీక్షలు
 ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారినే దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికచేస్తారు.
 సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగు నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపికకు ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
 ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ మూడూ పూర్తిచేయాలి. 100 మార్కులకు ఈ పరీక్షలు ఉంటాయి. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
తుది రాత పరీక్ష
 మొత్తం పేపర్లు: 4 - మార్కులు: 600
 పేపర్‌-1: ఆంగ్లం (100 మార్కులకు)
 పేపర్‌-2 : తెలుగు లేదా ఉర్దూ (100 మార్కులకు)
 ఈ రెండు పేపర్లు వివరణాత్మక విధానం (డిస్క్రిప్టివ్‌)లో ఉంటాయి. వీటిలో అర్హత మార్కులు సాధిస్తే చాలు.
 పేపర్‌-3 అర్థమెటిక్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ (200 మార్కులకు)
 పేపర్‌-4 : జనరల్‌ స్టడీస్‌ (200 మార్కులకు)
‣ వీటిల్లో ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి.
 ఆంగ్లం, తెలుగు పేపర్లలో అర్హత సాధించకపోతే మిగతా రెండు పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
 పేపర్‌-3, పేపర్‌-4లో 400 మార్కులకు అత్యధిక మార్కులు సాధించినవారిని సివిల్‌ ఎస్సై ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
 ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై పోస్టులకు పోటీపడేవారికి పేపర్‌-1, పేపర్‌-2 యథాతథంగా ఉంటాయి. పేపర్‌-3, పేపర్‌-4లను చెరో వందమార్కుల చొప్పున 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మార్కులకు దేహదారుఢ్య పరీక్షల్లో వచ్చిన మార్కులను కలపుతారు. అత్యధిక మార్కులు సాధించినవారిని ఉద్యోగానికి ఎంపికచేస్తారు.
సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపిక ఇలా
మొదటి దశ:
ప్రాథమిక రాతపరీక్ష: ఒకటే పేపర్‌ 200 మార్కులకు (3 గంటల పాటు)
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్‌ (పదోతరగతి స్థాయి), రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, భారతచరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత   కలిగిన వర్తమాన అంశాలు.
రెండో దశ:
శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షలు: ప్రాథమిక రాతపరీక్షలో అర్హత మార్కులు సాధించిన వారికే నిర్వహిస్తారు.
సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు తప్పనిసరిగా పూర్తిచేయాలి. లాంగ్‌జంప్‌ లేదా 100 మీటర్ల పరుగులో ఏదో ఒకటి పూర్తిచేయాలి. వీటిలో అర్హత సాధిస్తే చాలు. తుది ఎంపిక కోసం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీపడేవారు: 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ మూడూ పూర్తిచేయాలి. ఈ మూడు విభాగాల్లో ప్రదర్శించిన ప్రతిభకు మార్కులు కేటాయిస్తారు. వీటిని తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
మూడో దశ:
తుది రాతపరీక్ష: శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షల్లో ఎంపికైనవారికి తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. సివిల్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 200 మార్కులకు, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
పరీక్షలో వచ్చే అంశాలు: ఆంగ్లం, అర్థమెటిక్‌ (పదోతరగతి స్థాయి), రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, భారతచరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు.
సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది ఎంపిక: తుది రాతపరీక్షలో 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది ఎంపిక: చెరో వందమార్కులకు నిర్వహించే దేహదారుఢ్య, తుది రాతపరీక్షల్లో కలిపి మొత్తం 200 మార్కులకు అత్యధిక మార్కులు పొందినవారు ఉద్యోగానికి ఎంపికవుతారు.
ముఖ్యమైన తేదీలు
సివిల్‌ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు
 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 డిసెంబరు 14 నుంచి
 దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2023 జనవరి 1
 ప్రాథమిక రాతపరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 ఫిబ్రవరి 5 నుంచి
 పరీక్ష తేదీ: 2023 ఫిబ్రవరి 19 (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్‌-2)
సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు
 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2022 నవంబరు 30
 దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 2022 డిసెంబరు 28
‣ ప్రాథమిక రాత పరీక్షకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2023 జనవరి 9 నుంచి
 పరీక్ష తేదీ: 2023 జనవరి 22

 

నోటిఫికేషన్

స్టడీ మెటీరియ‌ల్‌

‣ ఇంగ్లిష్    

‣ అర్థ‌మెటిక్‌

‣ జనరల్ సైన్స్

‣ భార‌త‌దేశ చ‌రిత్ర‌, సంస్కృతి, భార‌త జాతీయ ఉద్య‌మం

‣ భార‌త‌దేశ భౌగోళిక శాస్త్రం, రాజకీయ‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌

‣ రీజ‌నింగ్‌, మెంట‌ల్ ఎబిలిటీ

‣ పాత ప్రశ్నప‌త్రాలు

‣ నమూనా ప్రశ్నపత్రాలు

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆఖరి దశలో క్యాట్‌ సన్నద్ధత ఎలా?

‣ ఊహ‌ల‌కు రూప‌మిస్తూ... ఉత్ప‌త్తులు రూపొందిస్తూ!

‣ పవర్‌ గ్రిడ్‌లో కొలువు కావాలా?

‣ ఉన్నాయా మీకు ఈ ఉద్యోగ లక్షణాలు?

‣ బీమా పథకాలను రూపొందిస్తారా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.