* పది ప్రశ్నల తొలగింపు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-4 సర్వీసు ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల తుది కీని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పేపర్-1లో ఏడు ప్రశ్నలు, పేపర్-2లో మూడు ప్రశ్నలు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా, ఇందులో అయిదు ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. తుది కీని టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఆమోదించినట్లు పేర్కొన్నారు. దీనిపై తదుపరి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 8180 గ్రూప్-4 సర్వీసు ఉద్యోగాల కోసం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా... దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం.. తొలగించిన ప్రశ్నల సంఖ్యలిలా!
పేపర్-1: 11, 21, 60, 73, 129, 132, 148
పేపర్-2: 25, 40, 78
జవాబుల ఆప్షన్లలో మార్పులు..
పేపర్-1: 19 (2 నుంచి 4కు మార్పు), 31 (2 నుంచి 1, 2, 3, 4), 40 (1 నుంచి 2), 50 (1 నుంచి 1, 2), 55 (2 నుంచి 2, 3), 64 (1 నుంచి 3), 128 (1 నుంచి 2), 139 (1 నుంచి 1, 4)
పేపర్-2: 11 (2 నుంచి 2, 4), 18 (1 నుంచి 4), 33 (4 నుంచి 1), 94 (2 నుంచి 3), 96 (2 నుంచి 3)
పేపర్-1 తుది 'కీ' కోసం క్లిక్ చేయండి
పేపర్-2 తుది 'కీ' కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.