• facebook
  • whatsapp
  • telegram

 Educational: దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా బెంగళూరు ఐఐఎస్‌సీ

‣ ప్రపంచంలో తొలి రెండు స్థానాల్లో హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌
‣ హైదరాబాద్‌ ఐఐఐటీకి 201-600 ర్యాంకుల్లో చోటు

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించి ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌’ విడుదలయ్యాయి. మనదేశం నుంచి అత్యున్నత విద్యాసంస్థగా బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ (ఐఐఎస్‌సీ) నిలిచింది. 2024 ఏడాదికి ర్యాంకింగ్స్‌లో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు తొలిస్థానాల్లో నిలిచి సత్తా చాటాయి. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం మొదటి రెండు స్థానాల్లో ఉంటే..  బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వర్సిటీలు 4, 5 ర్యాంకుల్లో నిలిచాయి. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పదో ర్యాంకులో ఉంది. భారతదేశానికి సంబంధించినంత వరకు ఫిజికల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో బెంగళూరు ఐఐఎస్‌సీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లలో 100-125 ర్యాంకుల కేటగిరీలో; ఫిజికల్‌ సైన్స్‌లో 201-250 ర్యాంకుల కేటగిరీలో ఉంది. లైఫ్‌ సైన్సెస్‌లో 201-250 ర్యాంకుల కేటగిరీలో స్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ ఐఐఐటీకి ఇంజినీరింగ్‌ విభాగంలో 201-600 ర్యాంకుల కేటగిరీలో స్థానం లభించింది. ఇంజినీరింగ్‌ కేటగిరీలో అన్నా విశ్వవిద్యాలయం 301-400 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకోగా.. జామియా మిల్లియా ఇస్లామియా, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, శూలిని యూనివర్సిటీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌; శిక్షా ‘ఒ’ అనుసంధాన్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు 401-500 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, ఐఐటీ గువాహటి, విట్‌ యూనివర్సిటీ వంటివి 201-600 ర్యాంకుల కేటగిరీలో ఉన్నాయి.

‣ 601-800 ర్యాంకుల కేటగిరీలో అమిటీ యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాపీఠం, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌- పిలాని, దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ఐఐటీ (ఇండియా స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌) ధన్‌బాద్‌, ఐఐటీ పట్నా ఉన్నాయి. ఇంజినీరింగ్‌ కాకుండా ఇతర విభాగాల్లో ప్రతిష్ఠాత్మక దిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాలు ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకు సంబంధించి 501-600 ర్యాంకుల కేటగిరీలో నిలిచాయి. సైకాలజీలో భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక వర్సిటీ.. దిల్లీ విశ్వవిద్యాలయం. ఈ విద్యాసంస్థ 401-500 ర్యాంకుల కేటగిరీలో స్థానం సంపాదించింది. వాణిజ్యం-అర్థశాస్త్రాల్లో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఇదే కేటగిరీలోకి వచ్చింది. క్లినికల్‌ అండ్‌ హెల్త్‌లో మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ 201-250 ర్యాంకుల కేటగిరీలో నిలవగా, సామాజిక శాస్త్రాల్లో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ 401-500 ర్యాంకుల కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!

‣ విశ్వమంతా సూక్ష్మరూపం!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.