• facebook
  • whatsapp
  • telegram

MBBS Seats: నిబంధన మారేనా.. సీట్లు నిలిచేనా?

* ప్రతి 10 లక్షల మందికి 100 ఎంబీబీఎస్‌ సీట్లే ఉండాలన్న ఎన్‌ఎంసీ

* పునఃపరిశీలించాలన్న రాష్ట్రాలు

* వారాలు గడిచినా ఎటూ తేలని వైనం

ఈనాడు, అమరావతి: ప్రతి పది లక్షల మంది జనాభాకు 100 ఎంబీబీఎస్‌ సీట్లే ఉండాలంటూ విధించిన నిబంధనను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఉపసంహరించుకుంటుందా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నిబంధనను పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తిచేశాయి. ఆ మేరకు కేంద్రం హామీ ఇచ్చి వారాలు గడిచిపోతున్నా ఏ సమాచారమూ రాష్ట్ర ప్రభుత్వాలకు చేరలేదు. కొత్త కళాశాలల అనుమతుల కోసం  డిసెంబరు నుంచి ఎన్‌ఎంసీ తనిఖీలు ప్రారంభం కావాలి. మన రాష్ట్ర జనాభా 5,34,56,000 మంది కాగా ప్రస్తుతం 6,435 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రతి 10 లక్షల మందికి 100 సీట్ల ప్రకారం చూస్తే 5,347 సీట్లే ఉండాలి. అదనంగా 1,088 సీట్లున్నాయి. కర్ణాటక (6.76 కోట్ల జనాభా)లో 6,770 ఎంబీబీఎస్‌ సీట్లకు 11,695, కేరళ (3.57 కోట్ల జనాభా)లో 3,577కు 4,655, తమిళనాడు (7.68 కోట్ల జనాభా)లో 7,685కు 11,600, తెలంగాణ (3.80 కోట్ల జనాభా)లో 3,809కు 8,540 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. మధ్యప్రదేశ్‌లో 1,600, పశ్చిమబెంగాల్‌లో 2,500, బిహార్‌లో 9 వేలు, యూపీలో 10 వేల దాకా ఎంబీబీఎస్‌ సీట్లు తక్కువయ్యాయి. దీనిని పరిగణనలోకి తీసుకొని... సీట్ల పెంపుపై జాతీయ వైద్య కమిషన్‌ దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించింది. పులివెందుల, మదనపల్లె, ఆదోని, పాడేరు, మార్కాపురంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌లో ప్రవేశాల ప్రారంభానికి అనుమతి కోరుతూ రూ.84 లక్షలు చెల్లించి, దరఖాస్తు చేశాక కొత్త నిబంధన వెలువడింది.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.