బీఎఫ్ఎస్ఐ, ఐటీ రంగాల్లో కొలువుల పైనా : సర్వే
దిల్లీ: ఇ-కామర్స్, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్- ఆర్థిక సేవలు (బీఎఫ్ఎస్ఐ), ఐటీ రంగాల్లో ఉద్యోగాలకు తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్లు) అధికంగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఉద్యోగ జీవితపరంగా వృద్ధి అవకాశాలు అధికంగా ఉండటం, మంచి పనివాతావరణం, ఉద్యోగం - జీవితం మధ్య సమతుల్యత పాటించేందుకు వారు ఈ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించింది. ఉద్యోగాలు, వృత్తినిపుణుల నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నా.కామ్ ఈ సర్వేను నిర్వహించింది. దీని ప్రకారం.. ఇ-కామర్స్ రంగాల్లోని ఉద్యోగాల కోసం దరఖాస్తులు 22 శాతం పెరిగాయి. బీఎఫ్ఎస్ఐ రంగంలో 18 శాతం పెరగ్గా, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాల్లో వరుసగా 13 శాతం, 5 శాతం మేర వృద్ధి ఉంది. మొత్తం 10,000 మంది నుంచి వివరాలు సేకరించి, రూపొందించిన ఈ సర్వే ప్రకారం..
‣ సూరత్, జయపుర, గ్వాలియర్, భోపాల్, ఇండోర్, లఖ్‌నవూ, కాన్పూర్ లాంటి ద్వితీయ (టైర్-2), తృతీయ (టైర్-3) శ్రేణి నగరాల్లో ప్రతి 10 మందిలో ఆరుగురు ఇ-కామర్స్, బీఎఫ్ఎస్ఐ రంగాలపై అత్యంత ఆసక్తితో ఉన్నట్లు సర్వేలో తెలిపింది.
‣ ఉద్యోగ స్థిరత్వంపై భరోసా ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యమిస్తున్నట్లు 34 శాతం మంది వెల్లడించారు.
‣ మంచి పేరున్న (బ్రాండు) కంపెనీల వైపు 22 శాతం మంది మొగ్గు చూపుతున్నట్లు తేలింది.
‣ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ జియో లాంటి బహుళజాతి కంపెనీల ఉద్యోగాల కోసం ప్రతి 10 మందిలో 8 మంది అడుగుతున్నారు. ఉద్యోగ భద్రత, బ్రాండు, నేర్చుకునే అవకాశాలు ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు.
‣ మంచి పనివాతావరణం, ఉద్యోగం- జీవితానికి మధ్య సమతుల్యత ఉండే పని ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తామని 38 శాతం మంది తెలిపారు. వృత్తిపరంగా పురోగతికే కాకుండా.. ఆరోగ్యమూ ముఖ్యమేననే అభిప్రాయాన్ని వీళ్లు వ్యక్తం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
సెయిల్‌లో టెక్నీషియన్ ట్రైనీలు
ఐఎంఐలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
ఆర్సీఎఫ్ఎల్లో 408 అప్రెంటిస్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.