* గవర్నర్కు తల్లిదండ్రుల సంఘం ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఏపీ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నరహరి.. గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేయకూడదనే నిబంధన ఉన్నా యాజమాన్యాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయన్నారు. బిల్డింగ్ ఫండ్ పేరుతో రూ.5 వేల నుంచి రూ.10 వేలు, అడ్మిషన్ ఫీజు పేరుతో ఏటా రూ.2 వేలు, ప్రాంగణ నియామకాలంటూ రూ.10 వేలు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.