• facebook
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన

* లీకేజీలకు ఆస్కారం లేకుండా సంస్కరణలు చేపట్టాలి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, ప్రవేశపరీక్షలు సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పీఎస్సీల పనితీరుపై అధ్యయనం చేసి.. నివేదిక సమర్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సిట్‌ అధిపతి ఏఆర్‌ శ్రీనివాస్‌, అప్పటి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవిలతో కలిసి సీఎం డిసెంబ‌రు 12న‌ సమీక్ష నిర్వహించారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాలను పంపించి.. అక్కడ నియామక ప్రక్రియపై అధ్యయనం చేయాలన్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనల మేరకు కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకాలు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు. టీఎస్‌పీఎస్సీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, అదనపు సిబ్బంది, మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు.
* ప్రశ్నపత్రాల లీకేజీకి కారణాలు, కేసు ప్రస్తుత స్థితి గురించి పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లీకేజీపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎంకు వారు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే 108 మందిని అరెస్టు చేశామని తెలిపారు. న్యాయస్థానంలో మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేశామని, రెండో ఛార్జిషీట్‌ కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు. సిట్‌లోని అధికారులంతా ఎన్నికల కారణంగా బదిలీ అయ్యారని వివరించారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షల తాజా పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ‘కమిషన్‌ ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసింది? ఎన్ని నోటిఫికేషన్ల పరీక్షలు రద్దయ్యాయి? ఎన్ని పూర్తి చేశారు? ఫలితాలు విడుదల చేశారా? కోర్టు కేసులు ఏమున్నాయ’ని కమిషన్‌ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.
 

కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే నోటిఫికేషన్లు!

ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలన్నా, పరీక్షలు నిర్వహించాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా.. టీఎస్‌పీఎస్సీ బోర్డు కీలకం. అయితే, కమిషన్‌ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ కార్యాలయంలో తన రాజీనామా లేఖ అందజేశారు. గవర్నర్‌ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. అక్కడ పర్యటన ముగిసిన తరువాత ఆయన రాజీనామాపై బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు, సభ్యులు కూడా రాజీనామాలకు సిద్ధమయ్యారు. ప్రొఫెసర్‌ బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, ఆర్‌.సత్యనారాయణలు సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం కలిసి ఈమేరకు సమాచారం ఇచ్చారు. అయిదుగురు సభ్యులు సాయంత్రం గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లగా.. ఆమె అందుబాటులో లేరు. బుధవారం ఆమెకు రాజీనామాలు సమర్పించనున్నారు. ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందితే.. కొత్త బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. కొత్త బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది. బోర్డు ఏర్పాటయ్యాక ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, మంగళవారం సాయంత్రం ఆర్‌.సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిరుద్యోగులకు లేఖ రాశారు.
 



 

  టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు

2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు

3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు

4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు

5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి

6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం

7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం

8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ

9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు

10.తెలంగాణ రాష్ట్ర విధానాలు

11.తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం

12.సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు

13.లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్


  టీఎస్‌పీఎస్సీ గ్రూప్ - IV  


పేపర్ - I - జనరల్ స్టడీస్
 

1.  కరెంట్ అఫైర్స్

2.  అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు

3.  నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం

4.  పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ

5.  భారతదేశం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం

6.  భారత రాజ్యాంగం: ముఖ్య లక్షణాలు

7  భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం

8  భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర

9  తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం

10  తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం

11  తెలంగాణ రాష్ట్ర విధానాలు


పేపర్ - II-సెక్రటేరియల్ ఎబిలిటీస్
 

1.  మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)

2.  లాజికల్ రీజనింగ్

3.  కాంప్రహెన్షన

4.  వాక్యాల వరుస క్రమం (ప్యాసేజ్ను మెరుగ్గా విశ్లేషణ చేయడం)5.  సంఖ్యా, అంకగణిత సామర్థ్యాలు


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.