• facebook
  • whatsapp
  • telegram

PhD: ఒకరి నుంచి మరొకరికి.. పీహెచ్‌డీ విద్యార్థుల బదిలీలు

* సీనియర్‌ ప్రొఫెసర్‌ హోదా కోసం ఓయూలో అడ్డదారులు
 

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ఆచార్యుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయంటూ ఔటా(ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌) ప్రతినిధులు ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. అది విచారణ ప్రారంభిస్తే ఉద్యోగం పోతుందని సీనియర్‌ ప్రొఫెసర్‌ హోదా పొందిన ఓ ఆచార్యుడు తాను తప్పుచేశానంటూ రిజిస్ట్రార్‌కు లేఖ రాయడం, ఆయన పదోన్నతిని రద్దు చేయడం వంటివి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అర్హతలు లేకుండానే యాభైమందికి పైగా ప్రొఫెసర్లకు ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌, ఉన్నతాధికారులు పదోన్నతులు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

యూజీసీ కేర్‌ గుర్తింపు లేకున్నా..

సీనియర్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారిలో చాలామంది ప్రొఫెసర్ల పరిశోధన పత్రాలకు యూజీసీ కేర్‌ గుర్తింపు లేదు. కొందరు ప్రొఫెసర్లు.. జూనియర్లు సమర్పించిన పరిశోధన పత్రాల్లో పదాలు, పేరాలను మార్చి తమ పరిశోధన పత్రం అని రాసుకున్నారు.  

* ఒక విభాగానికి డీన్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌.. తాను పది పరిశోధన పత్రాలు సమర్పించానని నివేదికలో రాసుకున్నారు. ఇందులో తొమ్మిది పత్రాలు యూజీసీ కేర్‌ జర్నళ్లలో లేవు. తనది కాని ఒక పరిశోధన పత్రాన్ని తనపేరిట రాసుకున్నారు.

* మరో విభాగంలో డీన్‌గా ఉన్న ప్రొఫెసర్‌ 2010లో గైడ్‌షిప్‌ తీసుకున్నారు. పరిశోధన విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారు. సీనియర్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి రావాలంటే పరిశోధన విద్యార్థులు పీహెచ్‌డీలు సమర్పించాలి. తన వద్ద లేకపోవడంతో ఇతర ప్రొఫెసర్ల నుంచి ఆరుగురు విద్యార్థులను బదిలీ చేయించుకుని నెలలో వారికి పీహెచ్‌డీలు వచ్చేలా చేసి పదోన్నతి పొందారు.

లోతుగా విచారణ నిర్వహించాలి: ప్రొఫెసర్‌ మనోహర్‌, ఔటా అధ్యక్షుడు
 

కమిటీ లోతుగా విచారణ నిర్వహించాలి. మా వద్ద అన్ని రికార్డులు ఉన్నాయి. విశ్వవిద్యాలయంలో కొందరు అధికారులు నచ్చినవారికే పదోన్నతులు ఇచ్చేందుకు అర్హులకు అన్యాయం చేశారు. కమిటీ ఛైర్మన్‌ దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్లనున్నాం.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.