ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలు ఆహ్వానించింది. కృత్రిమ మేధ(ఏఐ)-మెషిన్ లెర్నింగ్, ఏఐ-రోబోటిక్స్, ఐఓటీ, ఇండస్ట్రీస్ ఐఓటీ, డేటా సైన్సు, అనాలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి 29 కోర్సులను సూచించింది. మౌలిక సదుపాయాలు, శిక్షణ సామర్థ్యం ఆధారంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని, కంప్యూటర్ ల్యాబ్, యంత్రాలు, పరికరాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. అధ్యాపకులతోపాటు ఈ కోర్సుల్లో అనుభవం ఉన్న వారి సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది. 3 - 6 నెలలు సర్టిఫికేట్ కోర్సులుగా వీటిని నిర్వహించాల్సి ఉంటుందని, వారానికి ఒక గంట థియరీ, రెండు గంటలు ప్రాక్టీకల్స్ ఉండాలని తెలిపింది. థియరీ 15 గంటలకు ఒక క్రెడిట్, ప్రాక్టీకల్, నైపుణ్య శిక్షణ ఇచ్చే 30 గంటలకు ఒక క్రెడిట్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల, అధ్యాపకుల కనీస నిష్పతి 30 : 1గా ఉండాలని, ప్రతి కోర్సుకు ఉన్నత విద్యాసంస్థలు ముందుగా ఫీజులు నిర్ణయించి సొంత నిధులతో ఇవి కొనసాగేలా రూపకల్పన చేయాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ గ్రూప్ 1, 2 సక్సెస్‌కు ముఖ్య సూచనలు
‣ ఫ్యాషన్ కెరియర్లో ప్రవేశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.