• facebook
  • whatsapp
  • telegram

OU: విదేశీ విద్యార్థులూ రండి

* డిగ్రీ, పీజీల్లో ప్రవేశాలు కల్పిస్తామంటున్న ఉస్మానియా

* రాయబారులతో సంప్రదింపులు
 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు విదేశీ వ్యవహారాల విభాగం సంచాలకుల ద్వారా విదేశీ రాయబారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తుర్కమెనిస్తాన్‌ కాన్సుల్‌ కార్యదర్శి హమ్మత్‌ ముహమ్మదేవ్‌, రాయబార కార్యాలయ ఛాన్సరీ హెడ్‌ మెయిలిస్‌ బాషిమోవ్‌లను కొద్దిరోజుల క్రితం వర్సిటీకి ఆహ్వానించారు. త్వరలో మరింతమంది విదేశీ రాయబారులతో చర్చించనున్నారు.

ఫెలోషిప్‌లు పెరిగితేనే..

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాల మండలి మనదేశంలో చదువుకునేందుకు విదేశీ విద్యార్థులకు ఫెలోషిప్‌లు ఇస్తోంది. గతంలో ఏటా రెండువేల ఫెలోషిప్‌లు ఇవ్వగా, ప్రస్తుతం   వెయ్యికి తగ్గించింది. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల రాజకీయ పరిస్థితులు కారణంగా ఆ దేశాల విద్యార్థులకు ఫెలోషిప్‌లు నిలిపేశారు. కొన్ని ఆఫ్రికా దేశాలకు సైతం. ఫెలోషిప్‌ ఉంటే.. కోర్సు మొత్తానికి అయ్యే ఖర్చులో 40 నుంచి 70 శాతం వరకూ తగ్గుతుంది. ఫెలోషిప్‌ల మంజూరుపై అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల వంటివి ఆధారపడడంతో నిర్ణయం.. అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు.
 

విదేశీ విద్యార్థులు ఇలా..


ఆఫ్ఘనిస్తాన్‌-87, సూడాన్‌-69, యెమన్‌-63, అమెరికా- 48, తుర్కిమెనిస్తాన్‌-31, సోమాలియా-27, ఇథియోపియా-26 ఇతరులు-64.

ఉపాధి అవకాశాలంటూ ఆహ్వానిస్తున్నాం: ప్రొఫెసర్‌ శివరామకృష్ణ, ఓయూ

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీలు చదువుకుంటే మీ మీ దేశాల్లో ఉపాధి అవకాశాలుంటాయంటూ వారిని ఆహ్వానిస్తున్నాం. పీజీ తర్వాత పరిశోధక విద్యార్థులుగా చదువుకుంటే ఉపకార వేతనాలు వస్తాయని వివరిస్తున్నాం. అన్ని అంశాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు వారి సొంత దేశాలకు వెళ్లినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలను ప్రచారం చేయాలంటూ కోరుతున్నాం. పదోన్నతుల కోసం ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చిన అక్కడి అధికారులకు సైతం విషయాన్ని వివరించి ఓయూలో ప్రవేశాలు పెరిగేలా సహకరించాలని అభ్యర్థిస్తున్నాం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

‣ అర్థం చేసుకుంటూ చదివితే.. అధిక మార్కులు!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.