• facebook
  • whatsapp
  • telegram

Science Fair: సైన్సు ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థుల ప్రతిభ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ఆ విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యంశాలకే పరిమితం కాలేదు. మార్కుల కోసం పోటీ పడలేదు. తమలో దాగి ఉన్న ఆలోచనలకు పదును పెట్టారు. నిత్యజీవితంలో ఎదురవుతున్న పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ఇటీవల విజయవాడలోని జిల్లా వేదికగా చేసుకుని తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించి శెభాష్‌ అనిపించుకుంటున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు. నగరంలో నిర్వహించిన జిల్లా సైన్స్, విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో 91 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులును ప్రదర్శించారు. అందులో 9 మంది విద్యార్థుల నమూనాలు డిసెంబరు 28, 29న కడపలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయిని జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక, జిల్లా సైన్స్‌ అధికారి మైనం హుస్సేన్‌ తెలిపారు. ఇలా రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైన ఈ ప్రాజెక్టులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేకŸ కథనం. 
థర్మల్‌ పవర్‌ స్టేషన్‌: రాబిస్మిత (9వ తరగతి), కేబీసీ జడ్పీహెచ్‌ఎస్, పటమట 
ప్రస్తుతం విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. మనం సహజ వనరులైనా బొగ్గు, నీరు, గాలి నుంచి విద్యుత్తు శక్తిని తయారు చేస్తారు. బొగ్గు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం. అయితే బొగ్గును తక్కువ ఉష్ణోగ్రతలను వినియోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు.   
త్రిడిషేప్‌ గణిత నమూనాలు: జి.పూర్ణేశ్వరి, జి.జ్ఞాన కీర్తన (8వ తరగతి), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల కుంటముక్కల
గణితం అంటే చాలా మంది కష్టంగా భావిస్తారు. సాధన చేసిన మార్కులు తక్కువగా వస్తాయి. గణితంలోని సూత్రాలు, సమస్యలను సులభంగా ఎలా నేర్చుకోవాలి తెలియజేసి భళా అనిపించారు. 
శక్తిమార్పిడి: జి.పవన్‌సాయి (9వ తరగతి), ఎస్‌.బి.వి.ఎస్‌.ఆర్‌.ఎం.ఉన్నత పాఠశాల కండ్రిక 
నిత్యజీవితంలో టార్చిలైట్, ఆడియో బాక్సులు ఇలా వివిధ అవసరాలకు మనం పరికరాలను వినియోగిస్తాం. బహుళ ప్రయోజనాలు చేకూర్చే పెట్టెను తయారు చేశారు. ఇది రాత్రి సమయంలో లైట్‌గా ఉపయోగించుకోవచ్చు. పాటలు వినేందుకు సౌండ్‌ బాక్సుగా కూడా ఉపయోగించొచ్చు.  
సిగ్నల్‌ కంట్రోలర్‌: వి.లీలా వెంకట్‌ (9వ తరగతి), జడ్పీహెచ్‌ఎస్‌ గుంటుపల్లి
సిగ్నల్స్‌ ఇవ్వకపోవడం, కొన్ని చోట్ల స్టేషన్లుకు సమాచారం రాకపోవడం వల్ల రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది మృతి చెందుతున్నారు. వీటిని నివారించడానికి అధునాతనమైన సిగ్నల్స్‌ వ్యవస్థను రూపకల్పన చేశారు. రైల్వేస్టేషన్లుకు సమాచారాన్ని అందించేలా నమూనాలను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.