• facebook
  • whatsapp
  • telegram

Career Tool Kit: గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు ‘కెరీర్‌ టూల్‌ కిట్‌’

ఉద్యోగ నైపుణ్యాలు నేర్పే పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: సాధారణ డిగ్రీ, బీటెక్‌లో చేరిన విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ ఇచ్చేందుకు ‘కెరీర్‌ టూల్‌ కిట్‌’ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులు ప్రవేశాలు పొందినప్పటి నుంచి కోర్సు పూర్తయ్యే నాటికి ఉద్యోగాలు పొందేందుకు నేర్చుకోవాల్సిన కోర్సులు, నైపుణ్యాల వివరాలు కిట్‌లో పొందుపర్చామని వెల్లడించారు. విజయవాడలో జనవరి 2న ఉన్నత విద్యామండలి రూపొందించిన ‘కెరీర్‌ టూల్‌ కిట్‌’ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల మంది విద్యార్థులున్నారు. ఈ కిట్‌తో ఆన్‌లైన్‌లో 2వేల కోర్సులు ఉచితంగా నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఉత్తమమైన 50 విశ్వవిద్యాలయాలతో ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. త్వరలో 40వేల మంది విద్యార్థులకు పారితోషికాలతో కూడిన ఇంటర్న్‌షిప్‌ ఇవ్వనున్నాం’’ అని వివరించారు. అంతకుముందు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.