• facebook
  • whatsapp
  • telegram

Inter Exam Fee: ఇంటర్‌ పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లింపు!

* వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు బోర్డు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల సౌకర్యార్థం పలు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఇంటర్‌బోర్డు మరో అడుగు ముందుకు వేసింది. పరీక్షల ఫీజులను సైతం విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించేలా కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం కళాశాలలకు అనుబంధ గుర్తింపు, ఇతర అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారానే బోర్డు మంజూరు చేస్తోంది. విద్యార్థులకు అవసరమైన మైగ్రేషన్‌, ఎలిజిబిలిటీ, ఈక్విలెన్స్‌, డూప్లికేట్‌ మార్కుల మెమో లాంటి 18 రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. పరీక్షల ఫీజును మాత్రం విద్యార్థులు సొంతగా చెల్లించే వెసులుబాటు లేకపోవటంతో వాటిని ఆయా కళాశాలల ద్వారానే చెల్లించాల్సి వచ్చేది. ఫలితంగా పలు కళాశాలలు పరీక్షల ఫీజు పేరిట చెల్లించాల్సిన మొత్తానికి మూడు నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు తరచూ ఇంటర్‌బోర్డు దృష్టికి వస్తున్నాయి. దీన్ని నిరోధించేందుకు విద్యార్థులే స్వయంగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బోర్డు కొద్ది కాలం క్రితం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయా బ్యాంకులు, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రతినిధులతో చర్చిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది.




  టీఎస్‌పీఎస్సీజూనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్
 

♦ గణితశాస్త్రం 1A
♦రసాయన శాస్త్రం
♦వృక్షశాస్త్రం 
♦జంతుశాస్త్రం
♦భౌతికశాస్త్రం
♦గణితశాస్త్రం 1B
►పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
నమూనా ప్రశ్నపత్రాలు 


 

  టీఎస్‌పీఎస్సీ సీనియ‌ర్ ఇంట‌ర్‌ స్టడీమెటీరియల్  
 

♦గణితశాస్త్రం 2A
♦గణితశాస్త్రం 2B
♦భౌతికశాస్త్రం
♦జంతుశాస్త్రం
♦రసాయన శాస్త్రం
♦వృక్షశాస్త్రం
 ►పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
► నమూనా ప్రశ్నపత్రాలు 



 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.