• facebook
  • whatsapp
  • telegram

Eduction: రాష్ట్ర కళాశాలల్లో బోధకుల తగ్గుదల

* ఏడాదిలో ఆచార్యులు 19.30%, అధ్యాపకులు సంఖ్య 7.40% క్షీణత

* 2021-22 అఖిల భారత ఉన్నత విద్య సర్వేలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కళాశాల సాంద్రతలో తెలంగాణది రెండో స్థానం.. కళాశాలల సంఖ్యలో ఎనిమిదో స్థానం.. ఉన్నత విద్యలోకి ప్రవేశించే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. కానీ ఆచార్యులతోపాటు అధ్యాపకుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిపోతోంది. కేంద్ర విద్యాశాఖ జనవరి 25 రాత్రి విడుదల చేసిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే-2021-22 గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2020-21లో 6,817 మంది ఆచార్యులు లేదా ఆ స్థాయికి సమానమైన వారు ఉండగా.. 2021-22కి వారి సంఖ్య 5,501కి పడిపోయింది. అంటే ఏడాదిలో 19.30% తగ్గిపోయారు. ఇక అధ్యాపకుల సంఖ్య 80,318 నుంచి 74,342కు తగ్గింది. అంటే 7.4 శాతానికి తగ్గిపోయారు. రాష్ట్రంలో స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌) 40% మార్కును చేరుకుంది. అంటే 18-23 ఏళ్ల వయసున్న ప్రతి 100 మందిలో 40 మంది ఉన్నత విద్యలోకి ప్రవేశిస్తున్నట్లు. ఇందులో జాతీయ సగటు 28.4% మాత్రమే. ఈ పరిస్థితిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి మాట్లాడుతూ.. ‘బోధకుల తగ్గుదలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) బీటెక్‌లో అధ్యాపకుల సంఖ్య నిష్పత్తిని 1:15 నుంచి 1:20కి పెంచడం ఒక కారణంగా తెలుస్తోంది. జీఈఆర్‌లో ప్రగతిని బట్టి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారని అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.


రాష్ట్రంలో పరిస్థితి

దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది అధ్యాపకులు ఉండగా.. వారిలో తెలంగాణ నుంచి 8.2% మందే ఉన్నారు.

మొత్తం 2,12,474 మంది పీహెచ్‌డీ విద్యార్థుల్లో రాష్ట్రానికి చెందిన వారు 6,967 మంది ఉన్నారు. ఇందులో మనది 12వ స్థానం. మొత్తం 2083 కళాశాలలతో రాష్ట్రం 8వ స్థానంలో ఉంది.

18-23 సంవత్సరాల వయసు వారిలో ప్రతి లక్ష మందికి రాష్ట్రంలో 52 కళాశాలలు ఉన్నాయి. దీంట్లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. అయితే ఒక్కో కళాశాలలో దేశ సగటు విద్యార్థులు 709 మంది కాగా.. రాష్ట్రంలో 611 మంది మాత్రమే ఉన్నారు. 

అత్యధిక కళాశాలలున్న తొలి 10 జిల్లాల్లో హైదరాబాద్‌ 3వ స్థానం(491 కళాశాలలు)లో నిలిచింది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.