• facebook
  • whatsapp
  • telegram

NAAC: న్యాక్‌ గ్రేడింగ్‌ విధానం రద్దు!

దిల్లీ: దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడిటేషన్‌ వ్యవస్థ కింద గ్రేడ్లను ఇచ్చే విధానం త్వరలో రద్దు కానుంది. ఇకపై ఆ సంస్థలను ‘అక్రిడిటెడ్‌’, ‘అక్రిడిటెడ్‌ కాదు’ (నాట్‌ అక్రిడిటెడ్‌) అని మాత్రమే వర్గీకరిస్తారు. నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఈ మేరకు శనివారం (జనవరి 27) ఒక నిర్ణయం తీసుకుంది. అక్రిడిటెడ్‌ విద్యా సంస్థలకు ‘లెవల్స్‌’ కూడా ఇస్తామని, అవి ఒకటి నుంచి ఐదు మధ్య ఉంటాయని మండలి తెలిపింది. ఆయా విద్యా సంస్థలు అత్యున్నత ‘లెవల్‌’ సాధించేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశమని పేర్కొంది. ఈ సంస్కరణలను రెండు దశల్లో అమలు చేస్తామని వివరించింది. అక్రిడిటెడ్‌, అక్రిడిటెడ్‌ కాదు అనే విధానాన్ని వచ్చే నాలుగు నెలల్లో, ‘లెవల్‌’ వ్యవస్థను డిసెంబరు నాటికి ఆచరణలోకి తెస్తామని తెలిపింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.