• facebook
  • whatsapp
  • telegram

Group-1: గ్రూప్‌-1లో మరో 60 పోస్టులు

* 563కి పెరిగిన సంఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1లో మరో 60 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు మార్గదర్శనం చేస్తూ ఫిబ్రవరి 6న  ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ జారీచేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశాలిచ్చింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, తాజాగా అనుమతించిన వాటితో కలిపి పోస్టుల సంఖ్య 563కి చేరింది.

సుప్రీంలో వ్యాజ్యం సంగతేంటి?

2022లో 19 శాఖల్లోని 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరులో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) నిర్వహించింది. ప్రశ్నపత్రం లీకవడంతో ఆ పరీక్ష రద్దయింది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో మరోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా, పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే కారణంతో హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కమిషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ వ్యాజ్యం సుప్రీంలో నడుస్తోంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా లేదా సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. అలాగే గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే రెండు దఫాలుగా పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ ఇస్తారా? లేక పాతది రద్దు చేసి కొత్తగా జారీ చేస్తారా? అనే దానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. మహిళలకు రిజర్వేషన్లు, గ్రూప్స్‌ పరీక్ష విధానం తదితర కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకున్న తర్వాత టీఎస్‌పీఎస్సీ ముందడగు వేసే అవకాశం ఉంది.

కొత్తగా అనుమతిచ్చిన ఉద్యోగాలు

డీఎస్పీ-24, ఎంపీడీవో-19, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌-4, డిప్యూటీ సూపరింటెంటెండ్‌ ఆఫ్‌ జైల్స్‌-3, జిల్లా ఉపాధి కల్పన అధికారి-3, డిప్యూటీ కలెక్టర్‌-3, జిల్లా పంచాయతీ అధికారి-2, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-1, జిల్లా రిజిస్ట్రార్‌-1.



 

  టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి
6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం
8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ
9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు
10.తెలంగాణ రాష్ట్ర విధానాలు
11.తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
12.సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు

13.లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్


  ♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు   


   నమూనా ప్రశ్నపత్రాలు   


 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.