1. హైదరాబాద్‌లో డ్రోన్ పోర్ట్
హైదరాబాద్ పరిసరాల్లో డ్రోన్ పోర్ట్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన 20 ఎకరాల స్థలం కోసం ఫార్మా సిటీ వైపు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఎస్సీ ఉపవర్గీకరణకు కేంద్రం మద్దతు
రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. శతాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం చేసేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచారని, దాని అసలు లక్ష్యం నెరవేరటానికి ఉపవర్గీకరణ ఒక సానుకూల చర్య అని స్పష్టంచేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. బుమ్రా నం.1 బౌలర్
స్పిన్ పిచ్‌లపై వికెట్ల పండగ చేసుకుంటున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.అంజారియ
గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.అంజారియను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన కొలీజియం ప్రతిపాదించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 135 రోజుల కాల్పుల విరమణకు హమాస్ ప్రతిపాదన
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సుదీర్ఘ కాలం కాల్పుల విరమణకు ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి ఆమోద ముద్ర పడితే అది 3 దశల్లో అమలు కానుంది. ఈ మేరకు తమ ప్రతిపాదనను హమాస్ నాయకులు ఖతార్, ఈజిప్టులోని మధ్యవర్తుల బృందానికి పంపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.