• facebook
  • whatsapp
  • telegram

UPSC CGSE 2024: యూపీఎస్సీ సీజీఎస్‌ఎస్‌ఈ 2024 ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు

* ఫిబ్రవరి 18న పరీక్ష

ఈనాడు ప్రతిభ డెస్క్‌: కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2024 ప్రాథమిక పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో  అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 18న పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ద్వారా జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాట‌ర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, దిల్లీ, దిస్‌పూర్, హైదరాబాద్, జైపుర్, జమ్ము, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్(అలహాబాద్), షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.


యూపీఎస్సీ సీజీఎస్‌ఎస్‌ఈ 2024 ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.